TTD | తిరుమల కొండపై ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు దిగిన కొత్త జంట తమ తప్పును తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్ చేసినందుకు క్షమాపణలు చెప్పారు. శ్రీవారి సేవ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని తెలిపారు.
తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్ – గాయత్రి దంపతులు ఇటీవల తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆలయ ప్రాంగణంలో ఫొటోగ్రఫీ చేయరాదనే నిబంధన తమకు ముందుగా తెలియకపోవడంతో, అనుకోకుండా కొన్ని ఫోటోలు తీసినట్లు వారు తెలిపారు.
అయితే, ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే, ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ అనుకోని తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన దంపతులు.. భక్తులు, టీటీడీ అధికారులను క్షమాపణలు కోరారు. తాము చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా, శ్రీవారి సేవా సేవ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దంపతులు తెలిపారు. భక్తిసేవ ద్వారా తమ తప్పును పరిహరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాలు, నియమాలు ప్రతి భక్తుడూ తప్పనిసరిగా గౌరవించాల్సినవేనని, ఈ సంఘటన ద్వారా తాము గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో వివాదంగా మారిన కొత్త జంట ఫోటో షూట్
గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం
తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై వెలువడుతున్న… pic.twitter.com/pCQq4VQR4t
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026