తిరుమల: తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 9 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న 63,722 స్వామివారిని దర్శించుకోగా 22,225 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.77 ఆదాయం వచ్చిందన్నారు.
28న ‘డయల్ యువర్ ఈవో’
టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహిస్తున్నట్లు ఈవో శ్యామల రావు తెలిపారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని, భక్తులు 0877-2263261 అనే నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.