తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న స్వామివారిని 47,781 మంది భక్తులు దర్శించుకోగా 15,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.10 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈనెల 11 వరకు కొనసాగే ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు భక్తులు మాత్రమే రావాలని సూచించారు.
అచ్యుతాష్టకం , విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు
తిరుపతి నగరం లోని విద్యార్థినీ, విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అచ్యుతాష్టకం , విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఉదయం 9 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు.
పదేళ్ల లోపు విద్యార్థినీ, విద్యార్థులకు ”అచ్యుతాష్టకం” పై , 10 నుంచి 15 ఏళ్లలోపు వయసు గల వారికి “విష్ణు సహస్రనామ స్తోత్రం” మీద పోటీలు జరుగుతాయని తెలిపారు. విజేతలకు అదే రోజు బహుమతులు ప్రదానం చేస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 9676615643 మొబైల్ నంబర్ లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని సూచించారు.