Chintha Mohan | ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు న్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను అంగీకరించాలని కోరారు.
ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చింతా మోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు. ఏపీలో గెలవబోయే ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలని కోరారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఏపీకి కావాల్సిన వాటిని సాధించుకుందామన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలను సాధించుకునే వీలుంటుందని తెలిపారు.