హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెట్టరా పేరు అమరావతి’, లేదా పిలువరా ‘కమ్మ’రావతి అని గత ముఖ్యమంత్రికి తాను సూచించినట్టు ఆమె తెలిపారు. 12 ఏండ్ల నాటి విభజన చట్టంపై ఇప్పుడు చర్చ జరుగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
విభజన చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిందని మండిపడ్డారు. రాజధాని అమరావతితోపాటు విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులపై ఇప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని ధ్వజమెత్తారు.