(Vishaka Collector) విశాఖపట్నం: గత 24 గంటల్లో విశాఖపట్నంలో 183 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలి వారాల్లో అత్యధికంగా ఒక రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,448 లక్షలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖపట్నంలోని దవాఖానలపై దృష్టి సారించింది. ఈ మేరకు కలెక్టర్ మల్లికార్జున జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. పర్యాటకులు ఎక్కవగా సందర్శించే ఆర్కే బీచ్‌లో పలుచోట్ల ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. అనంతరం ఆరిలోవలోని హుద్ హుద్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి బ్లాక్‌ను కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పీ అరుణ్ బాబు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జీ లక్ష్మీ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
విమ్స్ దవాఖానను పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున.. అక్కడ అందుతున్న సేవలతోపాటు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, కింగ్ జార్జి ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఆయన.. జిల్లాలో జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక్కడి మార్చురీ అధ్వనంగా ఉండటంతో అభివృద్ధి పనులు చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి రాత్రి షిఫ్ట్‌లో పోస్ట్‌మార్టం కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..