Numerology | న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఒక వ్యక్తి స్వభావం, ఆలోచనావిధానం, కెరీర్, నాయకత్వ లక్షణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పుట్టిన తేదీ ద్వారా వచ్చే మూలాంకం ఆధారంగా ఆ వ్యక్తి వ్యక్తిత్వం, అభిరుచి, లైఫ్‌స్టైల్‌ను అంచనా వేయొచ్చని అంటున్నారు.
సంఖ్యా శాస్త్రంలో మూలాంకం 1కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకాన్ని 1గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి సూర్యుడిని అధిపతిగా భావిస్తారు. అందువల్ల మూలాంకం 1 కలిగిన వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ముందుండి నడిపించే స్వభావం ఎక్కువగా కనిపిస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మూలాంకం 1 కలిగిన వారు సాధారణంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవాలని కోరుకుంటారు. వీరి ఆలోచనలు ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయని, జీవితంలో పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటి కోసం కృషి చేస్తారు. సమాజంలో ప్రత్యేకంగా కనిపించాలని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వీరిలో ఆత్మగౌరవం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తమ నిర్ణయాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగుతారు. సవాళ్లను ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఎదుర్కొనే ధైర్యం వీరిలో కనిపిస్తుంది.
మూలాంకం 1 కలిగిన వారు విజయమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా భరించేందుకు సిద్ధంగా ఉంటారని అంటుంటారు. పని పట్ల అంకితభావం, పట్టుదల వీరిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయని చెబుతుంటారు. ఏ రంగంలో ఉన్నా తమ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే వీరు ఉద్యోగ, వ్యాపార, పరిపాలన, రాజకీయాలు, నిర్వహణ వంటి రంగాల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని న్యూమరాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
న్యూమరాలజీ ప్రకారం.. మూలాంకం 1 కలిగిన వారు స్వతంత్రంగా ఆలోచించడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద ఉండటం కంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కొత్త ఆలోచలను అమలు చేయడంలో ధైర్యంగా ముందడుగు వేస్తరు. నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యం, కష్టపడే తత్వం కారణంగా వీరు ఉన్నత పదవులకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకపోవడం కూడా వీరి విజయానికి కారణమవుతుందని చెబుతున్నారు.సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మూలాంకం 1 కలిగిన వారు సూర్యారాధన చేయడం వల్ల మానసికల బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అంటుంటారు.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తారంట!