Numerology | న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. వ్యక్తి స్వభావం, ఆలోచనావిధానం, కెరీర్, ఆర్థిక స్థితి, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే వచ్చే సంఖ్యను మూలాంకంగా పరిగణిస్తారు. ఈ మూలాంకం ఆధారంగా వ్యక్తి జీవితంలోని అనేక అంశాలను అంచనా వేయొచ్చని అంటుంటారు. అయితే సంఖ్యా శాస్త్రంలో కొన్ని మూలాంకాలు ప్రత్యేకంగా అదృష్టవంతమైనవిగా భావిస్తారు. వాటిలో ముఖ్యంగా మూలాంకం 6కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూలాంకం కలిగిన వారి అదృష్టం బంగారు పెన్నుతో రాసినట్లు ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి సంపద, సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం అన్నీ సులభంగానే లభిస్తాయని పేర్కొంటున్నారు.
ఏ నెలలోనైనా సరే 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూలాంకానికి శుక్ర గ్రహం అధిపతి. జ్యోతిష్యంలో శుక్రుడు సంపద, సౌందర్యం, విలాసవంతమైన జీవితం, కళలు, భోగభాగ్యాలకు కారకుడిగా భావిస్తారు. అందువల్ల ఈ మూలాంకం 6 కలిగిన వారి జీవితంలో ఈ అంశాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు.
ఈ మూలాంకం 6 వారికి సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుందని సంఖ్యా శాస్త్రం పేర్కొంటోంది. వీరి మాట తీరు, ప్రవర్తన, ఆలోచనా విధానం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి. కొత్త వ్యక్తులతో వీరు త్వరగా కలిసిపోతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందడంలో కూడా వీరు ముందుంటారు.
డబ్బులు సంపాదించడంలోనూ వీరికి చాలా అదృష్టం ఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో పోలిస్తే తక్కువ కష్టంతోనే మంచి ఫలితాలు, అవకాశాలు వీరికి లభిస్తాయిన అంటున్నారు. ఆదాయ వనరులు పెరగడం, ఆర్థిక స్థిరత్వం సాధించడం, విలాసవంతమైన జీవితం గడపడం వంటి అంశాలు వీరి జీవితంలో కనిపిస్తాయి.
మూలాంకం 6 గల వారు ఇన్నోవేషన్‌కు ప్రతీకలుగా చెప్పవచ్చు. కళలు, సంగీతం, ఫ్యాషన్, డిజైనింగ్, సినిమా, మీడియా, ప్రకటనల రంగం, వినోద పరిశ్రమ వంటి విభాగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందం, అభిరుచి, సృజనాత్మకత అవసరమయ్యే రంగాల్లో వీరి ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
లగ్జరీ లైఫ్ గడపాలనే కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ తమ ప్రతిభ, కృషి, అదృష్టం సహకారంతో ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తారంట!