Numerology | సంతోషంలోనే కాదు మన కష్టకాలంలోనూ తోడుగా నిలిచేది నిజమైన స్నేహితులే! అలాంటి స్నేహితులు దొరికితే జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు స్నేహానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారని.. తమ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారని చెబుతున్నారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం ముఖ్యంగా 3, 6, 9 కలిగిన వ్యక్తుల మధ్య స్నేహబంధం చాలా బలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వీరి ఆలోచనలు, భావోద్వేగాలు, వ్యక్తిత్వ లక్షణాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండటంతో స్నేహం మరింత గాఢంగా మారుతుందని చెబుతారు.
ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3గా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూలాంకానికి గురుగ్రహం అధిపతిగా కనిపిస్తారు. మూలాంకం 3 కలిగిన వ్యక్తులు తెలివితేటలు, వివేకం, నాయకత్వ లక్షణాలతో గుర్తింపు పొందుతారని చెబుతారు. వీరు స్నేహంలో ఎక్కువగా నిజాయితీని కోరుకుంటారు. ఒకసారి సమస్యలు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరిస్తే ఆ బంధాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. జీవితంలో ఏ సమస్యలు ఎదురైనా 6, 9 మూలాంకాలు కలిగిన మిత్రులు తమకు అండగా నిలబడతారని వీరు నమ్ముతారు. అందుకే ఈ మూడు మూలాంకాల మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగుతుందని చెబుతంటారు.
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి శుక్రుడు అధిపతి. దీని ప్రభావంతో మూలాంకం 6 కలిగిన వ్యక్తులు ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధకు ప్రతీకలుగా భావిస్తారు. వీరు తమ స్నేహితుల పట్ల ఎంతో కేర్ చూపిస్తారు. స్నేహితుడు కష్టాల్లో ఉంటే ముందుగా స్పందించే వారిలో వీరే ఉంటారు. వీరు ఎక్కువ భావోద్వేగపరులు కావడంతో స్నేహితులను కూడా తమ కుటుంబసభ్యుల్లాగే భావిస్తారు. అందుకే తమకు ఇష్టమైన వారి కోసం సమయం, శ్రమ, సహాయం అందించడంలో వెనుకాడరు. స్నేహితుడి సంతోషాన్ని తమ సంతోషంగా భావించే స్వభావం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 9గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి కుజ గ్రహాన్ని అధిపతిగా భావిస్తారు. మూలాంకం 9 గల వ్యక్తులు ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలుస్తారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే ధైర్యం వీరిలో ఉంటుంది. స్నేహితుడు ఇబ్బందుల్లో వెనక్కి తగ్గకుండా ముందుకొచ్చి సాయం చేయడంలో వీరు ముందుంటారు. కొన్నిసార్లు ఆవేశంగా కనిపించినప్పటికీ.. హృదయంలో మాత్రం ఎంతో నిబద్ధత కలిగి ఉంటారు. ఒకసారి స్నేహితుడిగా భావిస్తే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు.
న్యూమరాలజీ ప్రకారం.. మూలాంకం 3 వివేకం, మూలాంకం 6 ప్రేమాభిమానాలు, మూలాంకం 9 ధైర్యం కలిసి వచ్చినప్పుడు బలమైన స్నేహబంధం ఏర్పడుతుంది. అందుకే ఈ మూడు మూలాంకాలకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం సాధారణంగా మరింత గాఢంగా, దీర్ఘకాలికంగా ఉంటుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ న్యూమరాలజీలో పేర్కొన్న సాధారణ విశ్లేషణలు మాత్రమే. వ్యక్తుల స్వభావం, స్నేహబంధాలు అనేవి జీవన అనుభవాలు, వ్యక్తిగత పరిస్థితుల వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదంట..!