Numerology | కొంతమంది చూడటానికి బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ వాళ్లు ఏం అనుకుంటున్నారు? వారి మనసులో ఏం ఉందో అర్థం అర్థం చేసుకోవడం అంచనా వేయడం చాలా కష్టం. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలు బయట పెట్టకుండా లోతైన ఆలోచనలు, ఆధ్యాత్మిక దృక్పథంతో ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది.
సంఖ్యా శాస్త్రం ప్రకారం 7, 16, 25వ తేదీల్లో జన్మించిన వారి మూలాకం 7గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే వీరిని ఒక విధంగా మిస్టరీ బాక్స్‌తో పోలుస్తారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. వీరి మనసులో ఏముందో తెలుసుకోవడం ఇతరులకు అంత సులభం కాదు. బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా.. లోపల మాత్రం అనేక ఆలోచనలతో ఉంటారు.
మూలాంకం 7 గల వారి ఆధ్యాత్మికత, తాత్విక ఆలోచనలు, జీవిత రహస్యాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, విశ్లేషించడం, లోతుగా ఆలోచించడం వీరి సహజ స్వభావంగా ఉంటుంది. అందుకే సాధారణ విషయాలను కూడా విభిన్న కోణంలో పరిశీలిస్తుంటారు. వీరు చాలావరకు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. తమ భావోద్వేగాలను ఇతరులతో సులభంగా పంచుకోరు. సమస్యలు ఎదురైనా వాటిని తమంతట తామే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల కొన్నిసార్లు వీరిని ఇతరులు గర్విస్టులుగా భావించే అవకాశం ఉంది. కానీ వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని చెబుతుంటారు.
ఈ మూలాంకం గల వ్యక్తులకు అంతర్గత గ్రహణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని సంఖ్యా శాస్త్రం పేర్కొంటోంది. ఒక వ్యక్తి ఉద్దేశం ఏంటి? ఏ పరిస్థితి ఎలా మారవచ్చు అనే విషయాలను ముందుగానే అంచనా వేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. కళలు, సాహిత్యం, పరిశోధన, విజ్ఞానశాస్త్రం వంటి రంగాల్లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారు. కొత్త ఆలోచనలు చేయడం, సృజనాత్మక పనుల్లో పాల్గొనడం వీరికి ఇష్టం. సాధారణ మార్గాల కంటే విభిన్న దారులను ఎంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. ఏ విషయాన్ని అయినా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇదే వీరి ప్రధాన లోపంగా చెప్పొచ్చు. చిన్న విషయాల గురించి కూడా పదే పదే ఆలోచిస్తూ వీరు ఆందోళన చెందుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు చిరాకు, అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. సంపాదన బాగున్నప్పటికీ ఆర్థిక ప్రణాళికలో కొంత వెనుకబడే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరి గంభీరమైన స్వభావం కారణంగా రిలేషన్షిప్లో కొన్ని అపార్థాలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఇవన్నీ సంఖ్యా శాస్త్రంలో పేర్కొన్న సాధారణ విశ్లేషణలు మాత్రమేనని.. వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యం, పెంపకం, విద్య, జీవిత అనుభవాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!