Chandrababu | ఏపీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్ల కోసం అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ సేవలో’ పేరుతో ఒక పథకాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు.
దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభిస్తామని గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.కాగా, ఈ పథకాన్ని నాలుగో తేదీ నుంచి ప్రారంభించబోతున్నామని తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చాలా ఆలోచించి ఈ పేరు పెట్టామని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.15వేలు అందజేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద 2,90,234 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. సొంత ఆటో రిక్షా, మోటర్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థికసాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా కారణాలతో ఎవరినైనా లబ్ధిదారుల జాబితాలో చేర్చకపోతే.. వారి సమస్యలను పరిష్కరించి లబ్ధిదారుల జాబితాలో పేరు చేస్తామని తెలిపారు. ఈ పథకంఓ కోసం రూ.435 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.