అమరావతి : ఆంధ్రపదేశ్‌లో ఎన్నికల ముగిసినా పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీడీపీ( TDP), జనసేన కార్యకర్తల మధ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం( Pithapuram) నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి ఆలయ(Aparnadevi temple) నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా, ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు పొడచూపాయి. పొత్తులో భాగంగా స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటుని త్యాగం చేసి పవన్ కోసం పని చేశారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నాంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆలయ నిర్వహణ కోసం రెండు పార్టీలు మళ్లీ గొడవ పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పిఠాపురంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతల కొరకు జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ.
ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు. pic.twitter.com/DNxKk4USsB
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2024