అమరావతి : ఏపీలో సీఐడీ అధికారులు ( CID Officers ) పలు జిల్లాలోని డిస్టిలరీలపై ఏకకాల దాడులు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా డిస్టిలరీలు ( Distilleries ) తయారు చేసిన మద్యం వివరాలను సేకరించేందుకు సీఐడీ అధికారులు దాడులు చేశారు. తిరుపతి, అనకాపల్లి, ప్రకాశం, ఎన్టీఆర్, కడప ( Kadapa) , నంద్యాల, చిత్తూరు ( Chittoor ) జిల్లాలో ఉన్న డిస్టిలరీలపై పోలీసుల బందోబస్తు మధ్య దాడులను కొనసాగించారు.
కార్యాలయంలోకి ఎవరూ రాకుండా ప్రధాన గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. కార్యాలయాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్లను (Files) పరిశీలించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని డిస్టిలరీ, కడప శివారులోని ఈగల్ డిస్టిలరీ, ప్రకాశం ( Prakasam ) జిల్లాలోని సింగారయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని పెరల్ డిస్టిలరీని అధికారులు తనిఖీలు చేశారు.
నంద్యాలలో సీఐడీ అదనపు ఎస్పీ ముస్సేన్ పీర ఆధ్వర్యంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను సోదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంటనీ బయోటెక్ ఇండస్ట్రీస్‌లో మద్యం బాటిలింగ్ యూనిట్లో తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో ఉన్న ఎస్వీఆర్ డిస్టిలరీపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.