అమరావతి : తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో హుండీ లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు (Parakamani theft case) లో ఫిర్యాదుదారు సతీష్‌కుమార్ ( Satish kumar ) అనుమాన స్పదంగా మృతి సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే ట్రాక్ ( Railway Track) పై సతీష్‌కుమార్ మృతదేహం పడి ఉండడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యన్నార్( DG Ravi Shanker Ayyannar) శనివారం అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహంలో పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రసుత్తం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్‌కుమార్ మరణం హత్యకు నిర్ధారించిన నేపధ్యంలో మృతిపై దర్యాప్తు చేయాల్సిన కోణాలపై డీజీ అధికారులకు వివరించారు.
డీజీ రవిశంకర్ అయ్యన్నార్, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ హత్య ఘటనాస్థలాన్ని వెళ్లారు. తిరుపతిలో ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించారు. శవపరీక్ష నిర్వహించిన వైద్యులు న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమై కేసును లోతుగా విచారించారు. రేడియాలజిస్టుల నుంచి కూడా సమాచారం తీసుకున్నారు.
గుంతకల్లులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన సతీష్‌కుమార్ రైల్వేట్రాక్ పక్కన పడిఉండడాన్ని గమనించి ఆ దిశగా వివరాలు సేకరించారు. రైలు లోకో పైలట్, గార్డు, ఏ1 బోగి టీటీ పాపారావును, రైలు షెడ్డుకు చేరాక శుభ్రం చేసిన ఉద్యోగులను పోలీసులు విచారించాలని డీజీ ఆదేశాలు జారీ చేశారు. డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించారు.
పరాకమణి కేసు..
2023 ఏప్రిల్‌లో హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా అప్పటి విజిలెన్స్ ఎస్సైగా ఉన్న సతీష్‌కుమార్ పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అదే సంవత్సరం మే 30న రవికుమార్‌పై విజిలెన్స్ అధికారులు చార్జ్‌షీట్ ఫైల్ దాఖలు చేశారు. కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదనతో అతని ఆస్తులపై వైసీపీ నాయకులు కన్నేసారని ఆరోపణలు ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో కేసును వైసీపీ నాయకులు రాజీ చేయించి కేసును మూసివేశారు.
అనంతరం ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో పరకామణి వ్యవహారాన్ని బయటకు తీశారు. ఈకేసును సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించడంతో అధికారులు ఇటీవల విచారణను వేగవంతం చేశారు. దీంట్లో భాగంగా మాజీ ఏవీఎస్వో సతీష్‌కుమార్ విచారణకు హాజరయ్యేందుకు రైలులో వస్తుండగా అనుమానస్పదంగా మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది.