Chandra Babu | సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు
Chandra Babu | తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణకు సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు.
తిరుమల : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu ) స్వాగతించారు. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనదని అన్నారు. ‘సత్యమేవ జయతే,’ ’ ఓం నమో వెంకటేశాయ ’ అంటూ ట్విట్ చేశారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి(Justice BR Gavai), జస్టిష్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని.. ఇందులో రాజకీయ డ్రామా వద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్)ను కొనసాగించాలా? లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులిచ్చారు.
లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కేసు విచారణకు సిట్ విచారణ ఒక్కటే సరిపోదని, కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

