అమరావతి : విశాఖపట్నం అచ్యుతాపురం(Achyutapuram) సెజ్ ఫార్మా కంపెనీ(Pharma Company) రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) గురువారం పరామర్శించారు. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బయలుదేరిన సీఎం విశాఖ(Visaka)కు చేరుకున్నారు.
మెడికవర్, కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితుల వద్దకెళ్లి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా ఇచ్చారు. మేము అన్నీ చూసుకుంటామని భరోసా కల్పించారు.
Chanda Babu 113
ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటనలో 17 మంది మరణించారని, 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. 10 మందికి తీవ్రగాయాలయ్యాయని,26 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.
బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 లక్షలు పరిహారం అందజేస్తామన్నారు.