అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu) అమరావతి రాజధాని భవనాలను పరిశీలించారు. గురువారం దాదాపు మూడు గంటల పాటు ఆయన పర్యటన కొనసాగింది. 2014- 2019 వరకు టీడీపీ హయాంలో నిర్మించిన రాజధాని భవనాలను మంత్రి నారాయణ(Minister Narayana) , ఎమ్మెల్యే, అధికారులతో కలిసి పర్యటించారు. ముందుగా జగన్(Jagan) కూల్చేసిన ప్రజావేదికను సీఎం పరిశీలించారు.
ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించి , నీరు-మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతంలో మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. సీడ్ యాక్సెస్ రోడ్ను, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలను , మంత్రులు, జడ్జిల గృహసముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. ఐకానిక్(Iconic) నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను, రాజధాని ప్రాంతంలో నిర్మాణా స్థితిగతులను పరిశీలించారు.