అమరావతి : ఏపీలో టీడీపీ అభ్యర్థులకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) బీ ఫారాలను అందజేశారు. ఆదివారం ఉండవెల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం టీడీపీ పోటీ చేస్తున్న 144లో 141 మంది అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫారాల (B forms) ను అందజేశారు. మరో మూడు అసెంబ్లీ స్థానాల్లో బీ ఫారాలను అందజేయలేదు. ఈ స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరిగే అవకాశముందని టీడీపీ(TDP) వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బీ ఫారాలను పొందిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూ, విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఐదుచోట్ల అసెంబ్లీ అభ్యర్థుల మార్పు
పాడేరు (Paderu) నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు(Raghurama Raju) , శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్కుమార్పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎమ్మెస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana ) కి అవకాశం కల్పించారు.