అమరావతి : ఏపీలో ఓటమి బాధతో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu ) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ (TDP) శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఎమ్మెల్యేల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. దాడులు, ప్రతిదాడులు జరుగకుండా చూడాలని ఎమ్మెల్యే(MLAs) లకు సూచించారు.
శాంతి భద్రతల (Law and Order) అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీల మధ్య దాడులు జరుగుతున్నాయి. గత రెండురోజులుగా నాలుగైదు ఘటనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీ ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు జరిగాయి. ఈ విషయాలను తెలుసుకున్న చంద్రబాబు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగకుండా పార్టీ క్యాడెర్ను సముదాయించాలని సూచించారు.