తిరుపతి : తిరుపతిలో నిన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను ఒక్కొక్క బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకుని ఓదార్చారు.
తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు మహిళలకు చికిత్స నిమిత్తం ఐదు లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష రూపాయల పరిహారం (Compensation) అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. గాయపడ్డ భక్తులు అధైర్య పడవద్దని సూచించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునేంతవరకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భర్తిస్తుందని అన్నారు. గాయపడ్డ భక్తులు స్వామివారి దర్శనం కోరే వారికి దైవదర్శనం కల్పిస్తామన్నారు.
డిప్యూటీ సీఎంకు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు ఘటన వివరాలను వివరించారు. భక్తులను క్యూలైన్లలోకి ఒకేసారి ఎందుకు వదిలారని ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో పద్మావతి పార్కుకు భారీగా వచ్చారని అధికారులు తెలిపారు. తిరుపతి బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్‌ను పవన్ కల్యాణ్ పరిశీలించారు .