అమరావతి: తప్పుడు ప్రచారాలు చేసుకుని పబ్బం గడుపుకోవడం సీఎం చంద్రబాబుకు (Chandra Babu ) అలవాటేనని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి- పనకచర్ల (Godavari – Panakacharla) అనుసంధానం అనేది 280 టీఎంసీలతో నిర్మించాలని వైఎస్ జగన్ (YS Jagan) ఆలోచనకాగా చంద్రబాబు తన ఆలోచన అని ప్రచారం చేసుకోవడం దారుణమని అన్నారు.
తెలుగు తల్లి జలహారతి అనే నూతన కార్యక్రమం కూటమి నాయకులు జేబులు నింపుకోవడానికేనని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు తానే చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేసుకోవడం బాబుకు అలవాటేనని వ్యాఖ్యనించారు. పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది డాక్టర్ వైఎస్సార్ అని వెల్లడించారు.
అధిక ధనవంతుల ముఖ్యమంత్రుల జాబితాల్లో చంద్రబాబు ముందంజలో ఉంటారని గతంలోనే వైసీపీ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులోనూ ముఖ్యమంత్రి తెలివిగా తప్పించుకున్నారని విమర్శించారు. రాష్ట్ర రహదారులపై టోల్‌టాక్స్ వసూలు చేయడం దుర్మర్గమైన విషయమని అన్నారు.
కూటమి ప్రభుత్వం ముణ్నాళ్ల ముచ్చేటేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరునెలల కాలంలోనే వ్యతిరేకతను మూటకట్టుకుందని పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని శాఖలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని దుయ్యబట్టారు.