అమరావతి : ఏపీలోని కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ ఇద్దరూ కేంద్రంలోని బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ స్వార్థం కోసమే ఇద్దరు బీజేపీకి (BJP) మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు.
ఏపీకి కేంద్రం ఎలాంటి సహాయం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా కులగణన చేసి బీసీ(BC) లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీలిచ్చిన చంద్రబాబు ఒక చేత్తో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూనే మరో చేత విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.