(ORR to Rajahmundry) రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రానున్నది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు అవసరమైన అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిర్మాణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాలను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్డు రాజానగరం నుంచి వేమగిరి వరకు కొనసాగుతుందని ఎంపీ భరత్‌రామ్ తెలిపారు. ఇందుకోసం 400 నుంచి 500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. రోడ్డు నిర్మాణం, భూసేకరణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తుందని, ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఎంపీ తెలిపారు. అదేవిధంగా, రాజమండ్రి నగరం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్ల ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసిందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయని చెప్పారు. రాజమహేంద్రవరంలోని మోరంపూడి, జొన్నాడ ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం, కైకరంలో కూడా ఫ్లైఓవర్లు మంజూరయ్యాయని తెలిపారు. రాజమండ్రి అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని సమస్యలను సీఎం జగన్‌కు నివేదిస్తానని ఎంపీ చెప్పారు. అయితే, ఎంపీ వెల్లడించిన ఔటర్ రింగ్ రోడ్డు పనులకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్
— MARGANI BHARAT RAM (@BharatYSRCP) December 27, 2021
_భూసేకరణ నిధులతో పాటు నిర్మాణ వ్యయం కూ డా కేంద్రం నిధులతోనే..
_మోరంపూడి, దివాన్ చెరువు జంక్షన్ ల ఫ్లైఓవర్ లకు టెండర్లు
_టెండర్లు ఖరారైన రోజే మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం (1/5) pic.twitter.com/XffKWkanKg
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..