అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) వెల్లడించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని(Prime Minister), కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల వివరాలను మీడియా సమావేశంలో వివరించారు.
ప్రధాని మోదీ(Modi) కి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన 5 ఏండ్లల్లో జరిగిన నష్టాన్ని వివరించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు(Polavaram) 12, 500 కోట్లు పేజ్ వన్ కింద నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అభివృద్ధికి మొదటి దశ కింద రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చిందని వాటితో డిసెంబర్ నుంచి రోడ్లు, భవనాలు , ఇతర పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నిర్దిష్ట సమయంలో వాటిని పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ట్రాన్ని 2047 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారు చేసేందుకు డ్యాక్యూమెంట్ను రూపొందిస్తున్నామని ప్రధాని, మంత్రులకు వివరించానని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌కు భూములివ్వక వైసీపీ ఐదేండ్లు గడిపిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ల్యాండ్ ఇవ్వడంతో డిసెంబర్లో శంకుస్థాపన జరుగనున్నట్లు తెలిపారు.
విశాఖ నుంచి హౌరా వరకు నాలుగు లైన్లు అడిగామని తెలిపారు. నమో భారత్, వందేభారత్ రైళ్ల గురించి మాట్లాడినట్లు తెలిపారు. హైదరాబాద్-అమరావతి, అమరావతి-చెన్నై, హైదరాబాద్-చెన్నై కనెక్టివిటీ చేస్తూ బుల్లెట్ ట్రేన్ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.