Tirumala | తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని రెండో కిలోమీటర్ మైలురాయికి సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన కారు పక్కన ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి తలకిందులుగా పడిపోయింది.కారులో ఉన్న నలుగురు ప్రయాణికులను తమిళనాడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. అయితే కారులో వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కారు బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు మరింత ఆలస్యం ఏర్పడింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు వెంటనే ట్రాఫిక్ సమస్యను తీర్చారు. గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
కారు బోల్తా పడింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనంతో ఘాట్ రోడ్ుడపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కారులో తమిళనాడు భక్తులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారులోని వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.