Bus Accidnet | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.
నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల, కాలేజీకి చెందిన 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయల్దేరారు. 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది టీచర్లు, సిబ్బంది రెండు బస్సుల్లో వెల్లారు. అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవరం వైపు వస్తున్నారు. అయితే దివాన్‌చెరువు సమీపంలో ఓ గేదె రావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో అదే బస్సు వెనుక వస్తున్న రెండు విద్యాసంస్థల బస్సులు, మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నారు.

Rajamahendravaram2
ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువు సమీపంలోని ఓ మందిరానికి తరలించారు.