MSG |మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుండటంతో చిరంజీవి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. అయితే ఈ సినిమాతో మరో ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో చిరంజీవి తన పిల్లలతో కలిసి స్కూల్లో కనిపించే కొన్ని సన్నివేశాల్లో వచ్చే ‘ఫ్లై హై’ అనే పాప్ సాంగ్‌ను పాడింది చిరంజీవి మేనకోడలేనని అధికారికంగా వెల్లడైంది.
ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని రివీల్ చేయగా , తాజాగా మూవీ టీమ్ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఒక యువతి తనను తానే పరిచయం చేసుకుంటూ.. “నా పేరు నైరా. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని ‘ఫ్లై హై’ పాటను నేను పాడాను. ప్రస్తుతం సింగపూర్‌లోని లసలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో పాప్ మ్యూజిక్ స్టూడెంట్‌గా చదువుతున్నాను. ఈ సినిమాతోనే నేను సింగర్‌గా టాలీవుడ్లో డెబ్యూ చేశాను,” అని చెప్పింది. ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాప్ టచ్‌తో, యూత్‌ఫుల్ ఎనర్జీతో ఉన్న ఈ పాటకు నైరా స్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియోను షేర్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “నైరా చిరంజీవి గారి మేనకోడలు. చిరంజీవి చెల్లి మాధవి రావు గారి కూతురు. సినిమాలో ‘ఫ్లై హై’ పాటను చాలా బాగా పాడింది. ఇది ఆమెకు కేవలం బిగినింగ్ మాత్రమే. ముందుంది చాలా మంచి జర్నీ,” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారి, నైరాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. కాగా, చిరంజీవికి ఇద్దరు చెల్లెల్లు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరు విజయ దుర్గ – ఆమె కుమారులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో హీరోలుగా స్థిరపడారు. మరో చెల్లి మాధవి రావు మాత్రం డాక్టర్‌గా పనిచేస్తూ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె మీడియాకు దూరంగా ఉండటంతో, ఆమె కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ మందికి తెలియదు.ఇప్పటివరకు లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న మాధవి రావు కూతురు నైరా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు వచ్చారు. చిరంజీవి కుటుంబం నుంచి మరో కొత్త టాలెంట్ ఎంట్రీ ఇచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
A melody that celebrates the most selfless love of all ❤️#FlyingHigh Full Video Song from #ManaShankaraVaraPrasadGaru out tomorrow at 11:07 AM ❤️🔥
Sung by #Naira
Lyrics by #KittuVissapragada
Music by #BheemsCeciroleo #MegaSankranthiBlockbusterMSG in cinemas now 🫶🏻 pic.twitter.com/70Gvhi4qSX— Shine Screens (@Shine_Screens) January 20, 2026