(Murder) రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని కొల్లాపూర్ గ్రామంలో ఓ యువకుడి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. గత నెల 24 న నాగ సాయి అనే యువకుడిని నలుగురు కలిసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి.. రోజుకో భాగాన్ని కాల్చి బూడిద చేస్తూ వచ్చారు. మాంసం కాల్చిన దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణహత్య బయటకొచ్చింది.
కొల్లాపూర్ గ్రామానికి చెందిన నాగ సాయి అలియాస్ వెంకటేష్ దారుణహత్యకు గురయ్యాడు. నాగసాయిని చంపిన దుండగులు.. అతడి శరీర భాగాలను ముక్కలుగా చేసి రోజుకొకటి చొప్పున దహనం చేస్తున్నారు. తాజాగా దహనం చేస్తుండగా చెడు వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన రాజనగరం పోలీసులు సగం కాలిన శరీర భాగాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన రాజనగరం పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నాగ సాయిని దేనికోసం, ఎవరు హతమార్చారు? వ్యక్తిగత తగాదాలా? లేక ప్రేమ వ్యవహారమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..