Srisailam | సకల శుభంకరీ.. కాళరాత్రి.. గజ వాహనంపై గరళ కంఠుడి వైభవం..!
Srisailam | దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో ఏడోరోజు శనివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
Srisailam | శ్రీగిరిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో ఏడోరోజు శనివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. నల్లటి ఛాయాదేహంతో జుట్టు విరబూసుకుని భయంకరంగా ఉండి.. ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకలశుభంకరి అని భక్తుల విశ్వాసం.
ఆది పరాశక్తుల్లో ఏడవ రూపమైన కాళరాత్రి అమ్మవారు గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటక (ఇనుప ముండ్లు) ఆయుధాలుగా ధరించి రౌద్ర రూపంలో సకల శుభప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈదేవిని స్మరించడంతోనే భూతప్రేత, పిశాచాదులు భయపడి పారిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అర్చకులు తెలిపారు.
సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనాన్ని అధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేదపండితులు శాస్ర్తోక్తంగా విశేష పూజాధి క్రతువులు చేసి వాహనసేవను నిర్వహించారు. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగింది.
గ్రామోత్సవంలో భాగంగా గరళకంఠుడు కాళరాత్రి దేవి సమేతుడై ఆలయ ప్రాకారం నుండి మంగళ వాయిద్యాలు కళకారుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, కేరళ పంచవాయిద్యాల మిశ్రమ ధ్వనులు భజనల నడుమ వైభవంగా క్షేత్ర పురవీధుల్లో విహరించారు.
కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారితోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈఓలు హరిదాస్, మోహన్, రవికుమార్ పాల్గొన్నారు. అదే విధంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు సంగీత విభావరిని భక్తులు ఆద్యంతం తిలకించారు.
శనివారం మహాగౌరి అలంకారం
దసరా శరన్నవరాత్రి మహొత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనమిస్తారు. మల్లికార్జున స్వామివారు నందివాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

