అమరావతి : తిరుమల,తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD Board) చైర్మన్‌గా బీఆర్ నాయుడు (BR Naidu) నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 24 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం ప్రకటించింది.
బీఆర్ నాయుడు తెలుగు టీవీ న్యూస్ ఛానల్ అధిపతిగా కొనసాగుతున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత గత వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో అప్పటి ప్రభుత్వ హయాంలో నియమితులైన టీటీడీ పాలక మండలి తమ పదవులకు రాజీనామా చేసింది. చివరి చైర్మన్‌గా వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి పనిచేశారు. ఎన్నికలు జరిగి నాలుగు నెలలు పూర్తికావస్తున్న ఇంకా టీటీడీ ఈవో ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.