Tirupati | తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆయా హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు.
డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో వాటిని ఫేక్ మెయిల్స్‌గా పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో నాలుగు రోజుల క్రితం కూడా ఈ నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఫేక్ మెయిల్స్‌గా నిర్ధారించారు. దీనిపై రెండు కేసులు నమోదు చేశారు.
తిరుపతిలో బాంబు బెదిరింపులపై ఎస్పీ సుబ్బరాయుడు బైట్..#Tirupati #Bombthreat #RTV pic.twitter.com/9bFJRNe8qs
— RTV (@RTVnewsnetwork) October 26, 2024