Tirupati | తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం జల్లెడ పట్టారు.
కలెక్టర్ చాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. అలాగే పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేనట్లుగా నిర్ధారించారు. మరోవైపు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు. గడిచిన 15 రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్స్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.