తిరుమల : టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ టీటీడీ(TTD) ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ ( Annaprasadam) కు శుక్రవారం రూ.10 లక్షలు విరాళం( Donation) అందించారు. ఈ మేరకు ఆయన తిరుపతిలోని అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈనెల 20న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా 17న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని తెలిపారు. అమవాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టీటీడీ రద్దు చేసిందన్నారు.