Kiran Kumar Reddy | మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని వివరించారు. సోమవారం నాడు నెల్లూరులో పర్యటించిన కిరణ్కుమార్ రెడ్డి.. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవరినీ అడగలేదని తెలిపారు. సీఎం పదవి కోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
కానీ ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించానని కిరణ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని వివరించారు. ఏపీ అప్పులమయంగా మారిందని అన్నారు. అభివృద్ధిలో బాగా వెనుకబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఏపీకి పోలవరం ఒక వరమని ఆయన పేర్కొన్నారు. పోలవరం పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే అమరావతిని కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని.. ఎంత వేగంగా అభివృద్ధి చేస్తే అంతకంటే వేగంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. వైఎస్ జగన్కు బీజేపీ సపోర్టు చేస్తుందని అనడం సరికాదని హితవుపలికారు. అది కోర్టుల్లో ఉన్న వ్యవహారమని.. సీఐడీ, ఈడీ కోర్టులకు సంబంధఙంచినదని తెలిపారు ఏడాదిలోపే విచారణ పూర్తి కావాల్సి ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగుల వల్ల జాప్యం జరుగుతుండొచ్చని అభిప్రాయపడ్డారు.