TTD | టీటీడీ నూతన పాలక మండలిలో మరో సభ్యుడికి ఏపీ ప్రభుత్వం చోటు కల్పించింది. బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డికి పాలక సభ్యుడిగా దేవాదాయ శాఖ చేర్చింది.
ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమిస్తూ.. 24 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని ఏపీ దేవాదాయ శాఖ ప్రకటించింది. తాజాగా ఇందులో భానుప్రకాశ్ రెడ్డి పేరును చేర్చడంతో పాలకమండలి సభ్యుల సంఖ్య 25కి చేరింది. పాలకమండలిలో ఎక్స్అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో కొనసాగనున్నారు.
శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా బాపిరెడ్డి నియామకం
శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా బాపిరెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న బాపిరెడ్డిని డిప్యూటేషన్‌పై బదిలీ చేసి ఈవోగా నియమించింది.