అమరావతి : తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్(TTD Chairman) పదవికి భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar reddy,) రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అనుంగ అనుచరుడిగా పేరున్న భూమన చిత్తూరు నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ(YCP) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
సంవత్సరం క్రితం వైఎస్ జగన్ అతడికి టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమన పోటి చేయకుండా అతడి కుమారుడు అభినయ్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే అతడు ఓడిపోవడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.