Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం కేంద్రమంత్రి పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు, తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో ఆయన సమీక్షించారు.
అనంతరం కింజారపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 86 శాతం నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. రన్ వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ వంటి పనులు వంద శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. టెర్మినల్ 79 శాతం, ఏటీసీ 90 శాతం, బిల్డింగ్స్ 62 శాతం, కనెక్టింగ్ రోడ్లు 68 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 2026 జూన్లో ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు రాకపోకల కోసం సులభతరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనిపై ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు నిర్వహించామని.. మొత్తం ఏడు పాయింట్లు గుర్తించామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లోగా ఈ రహదారులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఎయిర్పోర్టుకు అనుసంధానంగా బీచ్ కారిడార్ పనులను త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీచ్ కారిడార్ ఎలైన్మెంట్ను మార్చారని ఆరోపించారు. బీచ్ కారిడార్ నిర్మాణం కోసం కూడా డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించామని పేర్కొన్నారు.