Bhanu Kiran | హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ బయటకు వచ్చారు. జైలు బయట మీడియా ప్రతినిధులు.. భాను కిరణ్ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. 12 ఏండ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు కదా..? అని భాను కిరణ్‌ని మీడియా ప్రశ్నించగా, ఆయన కనీసం స్పందించలేదు. భాను కిరణ్ ఉన్న వాహనంలో లాయర్లతో పాటు పలువురు వ్యక్తులు ఉన్నారు.
అయితే సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసుల్లో భాను కిరణ్‌కు బెయిల్ లభించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్ లభించిన కూడా జీవిత ఖైదు కింద జైలు జీవితం గడపనున్నాడు భాను కిరణ్. 12 ఏండ్లుగా ఇదే జైలులో ఉంటున్న భాను కిరణ్ తన జీవిత ఖైదు కేసుపై క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు స్థానిక కోర్టులో తేల్చుకోమని స్పష్టం చేసింది. కాగా ఈ పిటిషన్‌కు సంబంధించి ఈ నెల 11న (నవంబర్ 11, 2024) విచారణకు రానుంది.
టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి. తన కుటుంబంలో ఉన్న అందరిని హత్య చేశాడు అన్న కోపంతో పరిటాల రవి చంపాలని నిర్ణయించుకున్నాడు సూరి. ఈ క్రమంలోనే 2005లో పరిటాల రవిని కాల్చి చంపాడు. ఇక పరిటాల రవిని హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన సూరిని 2011 జనవరి 4న భాను కిరణ్ కాల్చి చంపాడు. ఇక అనంతపురం ఫ్యాక్షన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తోచ్చే పేర్లు పరిటాల రవి, మద్దెలచెరువు సూరి, మొద్దు శీను, ఓం ప్రకాశ్, భాను కిరణ్. దీనిపైనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2010లో రక్త చరిత్ర అనే సినిమా కూడా తీశాడు.
ఇవి కూడా చదవండి..
America Vice President | అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడే
Kadapa SP Transfer | కడప ఎస్పీ ఆకస్మిక బదిలీ.. వైసీపీ కార్యకర్తను వదిలి పెట్టడంపై ప్రభుత్వం సీరియస్