YS Vijayamma | వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదే అదునుగా జగన్‌పై టీడీపీ రకరకాల వదంతులను ప్రచారం చేస్తుంది. సొంత తల్లినే చంపించేందుకు జగన్ చూశారని కూడా ఆరోపించింది. దాన్ని బహిరంగ లేఖ ద్వారా వైఎస్ విజయమ్మ ఖండించింది. అయినప్పటికీ అది ఫేక్ లెటర్ అంటూ జగన్‌పై టీడీపీ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ డైరెక్ట్‌గా స్పందించారు. తన కుమారుడు, వైఎస్ జగన్‌ను సమర్థిస్తూ ఈసారి ఏకంగా వీడియోనే రిలీజ్ చేశారు.
ఏపీలో రాజకీయాలు వ్యక్తిగత విమర్శల నుంచి కుటుంబ వ్యవహారాలను బయటపెట్టి వారి వ్యక్తిగత హననం చేసే వరకు వచ్చాయని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న ఆస్తి విభేదాలను అడ్డుపెట్టుకుని కొందరు తమ క్యారెక్టర్‌ను దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరి కుటుంబంలోనైనా భిన్నాభిప్రాయాలు సహజమేనని అన్నారు. కానీ వాటిని అడ్డుపెట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం తమను అడ్డుపెట్టుకుని ఇంత నీచానికి దిగజారుతారా అని మండిపడ్డారు.
ఏదైనా విబేధాలు వస్తే తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అన్నకు చెల్లి కాకుండా పోతుందా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిన కారు ప్రమాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు. రాజకీయాల్లో ఇంతటి దిగజారుడుతనాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుందని తెలిపారు. ఇకపై తమ పరువుకు సంబంధించిన విషయాలపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రాజకీయంగా పోరాడాలంటే జగన్‌తో డైరెక్ట్‌గా పోరాడాలని అన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారానికి కౌంటర్ ఇచ్చిన విజయమ్మ.
కుటుంబంలో తగాదాలు ఉన్నంత మాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా.
అన్నకి చెల్లి కాకుండా పోతుందా.
– విజయమ్మ pic.twitter.com/0pf3Ny8AYw
— The RajaSaab (@PardhuDesigns) November 5, 2024