అమరావతి : ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ (Jagan) మూడేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్ (BC Declaration) పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం , అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు.
జగన్ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత దక్కిందని పేర్కొన్నారు. అమరావతిలో తాత్కలికంగా అసెంబ్లీని, హైకోర్టును, సచివాలయాన్ని నిర్మించారని అదే జగన్ 11వేలకు పైగా గ్రామ సచివాలయలు కట్టారని వెల్లడించారు. మెడికల్ కాలేజీలు కట్టి విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారని, పోర్టులు కట్టి ఉపాధి కల్పించారని తెలిపారు.