Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు సురేశ్ రిమాండ్‌ను పొడిగిస్తూ మంగళగిరి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఇటీవల నందిగం సురేశ్ అరెస్టయ్యారు. 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం ఆవరణలోని వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిని వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆఫీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. టీడీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల రికార్డుల ద్వారా పలువురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.