జన్మదిన వేడుకలకు వచ్చి మృత్యువాత.. రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది దుర్మరణం
బంధువుల ఇంట్లో జన్మదిన వేడుకలకు హాజరయ్యాక తిరిగి స్వగ్రామానికి ప్రయాణమైన బావ, బావమరిదిని మృత్యువు కబళించింది.
అశ్వారావుపేట, ఏప్రిల్ 5: బంధువుల ఇంట్లో జన్మదిన వేడుకలకు హాజరయ్యాక తిరిగి స్వగ్రామానికి ప్రయాణమైన బావ, బావమరిదిని మృత్యువు కబళించింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటి రామన్నగూడెం గ్రామానికి చెందిన మడకం సంతోష్ (19), పండు సందీప్ (20) కూలి పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం చిచ్చొడుగుంపు లోని సంతోష్ మేనమామ చిచ్చోడు సత్తిపండు కుమార్తె జన్మదిన వేడుకలకు ఆదివారం సంతోష్, సందీప్ కలిసి హాజరయ్యారు.
వేడుక అనంతరం ఇద్దరూ సాయంత్రం బైక్పై తమ స్వగ్రామం బయలుదేరారు. మార్గమధ్యలో అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం శివారు లో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సంతోష్ సోదరి, సందీప్ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

