అమరావతి : పల్నాడు ( Palnadu ) జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తా హనుమంతు ( Hanmanth ), కొత్తా శ్రీరాంమూర్తి ( Srirammurthy ) అనే ఇద్దరు అన్నదమ్ముళ్లను వేటాడి చంపారు.
శ్రీరాంమూర్తిని అమ్మవారి గుడి సమీపంలో, హనుమంతును గ్రామం మధ్యలో అత్యంత కిరాతకంగా చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా ఈ హత్యలపై పల్నాడు జిల్లా ఇన్చార్జి గొట్టిపాటి రవికుమార్ స్పందించి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను తక్షణమేపట్టుకుని కఠినంగా శిక్షించాలని , ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.