అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది . అనారోగ్యంతో ఇద్దరు వృద్ధదంపతులు (Elderly couple) ఆత్మహత్య (Suicide) చేసుకోవడం కలకలం సృష్టించింది . విజయనగరం జిల్లా వి. టి అగ్రహారంలో నివాసముంటున్న భార్య భర్తలు సత్యనారాయణ(60), పార్వతీ ( 55) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రాత్రి ఇద్దరు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
తల్లిదండ్రులు బయటకు రాకపోవడంతో వారి కుమారుడు కిటికీలు తొలగించగా తల్లిదండ్రులు విగతజీవిగా పడి కనిపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.