అమరావతి : ఏపీ(Andhra Pradesh) లోని ప్రకాశం, నంద్యాల జిల్లా సరిహద్దులో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం పచ్చర్ల గ్రామానికి చెందిన మొహరున్సీసా అనే మహిళ(Women) కట్టెల కోసం నంద్యాల,గిద్దలూరు రోడ్డుపై అడవిలోకి వెళ్తుండగా అక్కడే మాటు వేసిన చిరుతపులి (Cheetah attack ) మహిళపై దాడిచేసి చంపివేసింది. ఆమె వెంట వెళ్లిన మరికొందరు భయంతో గ్రామానికి చేరుకుని సమాచారం చేరవేశారు. దీంతో గ్రామస్థులు అటు పోలీసులకు, ఇటు అటవిశాఖాధికారులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి వెళ్లిన అధికారులకు రోడ్డు పక్కనే మహిళ మృతదేహాం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmartem) కోసం ఆస్పత్రికి తరలించారు. చిరుత దాడితో పరిసర గ్రామాల ప్రజల్లో భయాందోలనలు నెలకొన్నాయి.