అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ సేవలు (Arogya Shree services ) నిలిచిపోయాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యవసర సేవలను(Emergency services) మినాహాయించి అన్ని సేవలను నిలిపివేశారు.
ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.2500 కోట్ల బకాయిలు విడుదల చేయడం లేదంటూ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నాయకులు నోటీసులు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో స్వాతంత్య్రం దినోత్సవం(Independence Day) నుంచి సమ్మె(Strike) కు పిలుపునిచ్చారు.
దీంతో గురువారం నుంచి సేవలను నిలిపివేశారు. అయితే నిన్న రూ. 200 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, సోమవారం మరో రూ. 300 కోట్లను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు అసోసియేషన్ ప్రతినిధులు ససేమిరా అనడంతో సమ్మె అనివార్యమైంది .
రేపు(శుక్రవారం) ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. సమ్మె కారణంగా గురువారం పలు జిల్లాలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆపరేషన్ల కోసం ఆరోగ్య శ్రీ నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.