అమరావతి : మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Constable) కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎల్విన్‌పేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ (AR constable) బుల్లిబాబు గురువారం కురుపాం మండలం జగడ-నీలకంఠంపురం ఘాట్‌రోడ్డు నుంచి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పింది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ మరణం పట్ల జిల్లా పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.