RTC Bus Fire Accidet | అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు.. కడప జిల్లాలో ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
బస్సులో నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కాగా, అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎక్కువగా వేయడంతో విద్యుత్ లైన్ బస్సుకు తాకి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ వైర్లు తాకడంతో ఓ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 21 మంది ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందికి దిగిపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.#FireAccident #AndhraPradesh #Bus pic.twitter.com/sPmpEvQkqt
— Journalist Scoop (@journalistscoop) April 5, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

