అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అర్దరాత్రి గ్రూప్ -2 పరీక్షల తుది ఎంపిక జాబితాను ( Final Selection) విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
ఇంకా ప్రకటించని 14 పోస్టుల్లో 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడం, స్పోర్ట్స్ కోటకు సంబంధించి రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో లా ఏఎస్వో , ఎక్సైజ్ ఎస్సై పోస్టులను పక్కన పెట్టింది.
2023 డిసెంబర్ 7న వైసీపీ హయాంలో గ్రూప్ -2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మొయిల్ పరీక్షలు నిర్వహించి అదే సంవత్సరం ఏప్రిల్ 4న ఫలితాలు విడుదల చేసింది.