AP Weather | ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని దీని హెచ్చరించింది. అలాగే సెప్టెంబర్ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజర్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు ఉందని ఆయన తెలిపారు. ధవళేశ్వం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7.58 లక్షల క్యూసెక్కుల ఉందని పేర్కొన్నారు. రేపటిలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,08,838 క్యూసెక్కులు ఉందని తెలిపారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు.
Follow Us : on Facebook, Twitter
TG Weather | సెప్టెంబర్ 2 వరకు తెలంగాణలో వానలు.. వెల్లడించిన వాతావరణ కేంద్రం
IAS Shiva Shankar | ఏపీకి మరో ఐఏఎస్ కేటాయింపు.. శివశంకర్‌ను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
Kotamreddy Sridhar Reddy | సంచలన వీడియోలో ఉన్నది కోటంరెడ్డి అనుచరులేనా!-